Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 02:56 PM

జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి

06-10-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు పంపిన TUWJ-H143 జర్నలిస్టులు.

చిట్యాల: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ (EJHS) హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (TUWJ-H143) చిట్యాల మండల అధ్యక్షుడు రేగొండ వేణుమాధవ్‌ డిమాండ్‌ చేశారు.

TUWJ-H143 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చిట్యాలలో జర్నలిస్టులు పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తమ డిమాండ్లను తెలియజేస్తూ పోస్ట్‌కార్డులను పోస్టాఫీసులోని పోస్ట్‌బాక్స్‌లో వేశారు.

ఈ సందర్భంగా వేణుమాధవ్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వార్తల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఆరోగ్య సేవలు అందించేలా ఈజేహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా శ్రీనివాస్‌, కంభంపాటి సతీష్‌, కార్యదర్శి చిర్రబోయిన మల్లేష్‌, మండల ప్రధాన కార్యదర్శి చెన్నోజు చంద్రశేఖర్‌, కోశాధికారి బోడిగె విజయ్‌కుమార్‌, కార్యదర్శి మూడ వెంకటాద్రి, టెమ్జూ నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్‌, జర్నలిస్టులు పాటి మోహన్‌రెడ్డి, జిట్ట నరేష్‌, గుండ్లపల్లి వెంకన్న, అంతటి నాగరాజు, దేశబోయిన సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News