Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీకి బద్దం మల్లేష్ గౌడ్ శుభాకాంక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 08:15 AM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన టీయూడబ్ల్యూజే

03-10-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేటలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన దీక్ష, రాస్తారోకో

సూర్యాపేట: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) దేశవ్యాప్త డిమాండ్ల డే పిలుపులో భాగంగా సూర్యాపేటలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టిన అనంతరం కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన జర్నలిస్టులకు వర్తింపజేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అర్హులైన వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు రైల్వే పాస్‌లను యథావిధిగా అమలు చేయాలని, వృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై ఇటీవల దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాల్లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్, జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ, జిల్లా కోశాధికారి గుంటూరు రాము, దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షుడు బాదే రాము, సీనియర్ జర్నలిస్టులు వర్ధెల్లి అరుణ కృష్ణ, నరసింహస్వామి, ఎలుక రామ్ రెడ్డి, దుబ్బాక మల్లారెడ్డి, భూపతి రాములు, సుంకరబోయిన వెంకటయ్య, ధనియాకుల వెంకటేశ్వర్లు, పల్లె మణిబాబు, మర్రెడ్డి, కందుకూరి యాదగిరి, జి.ఎస్. రెడ్డి, విక్రమ్, తల్లాడ చందన్, బైరబోయిన వెంకటేశ్వర్లు, షేక్ రషీద్, కందుల నాగరాజు, శిగ సురేష్, ఉయ్యాల నరసయ్య, లింగాల సాయి, కొండ్లె కృష్ణయ్య, వేణు, సుధాకర్, శ్రీరంగం వెంకన్న, సోమేశ్ గౌడ్, మామిడి శంకర్, పులుసు నాగరాజు, గుడిపూడి రామకృష్ణ, బిగ్ టీవీ రామకృష్ణ, మహా న్యూస్ సురేందర్, జలగం మధు, తండు వెంకన్న, దుర్గం బాలు, అయోధ్య రెడ్డి, యో యో టీవీ శంకర్, జహీర్, వల్దాస్ శంకర్, పాషా, రామచంద్ర రాజు, గుండాల లింగయ్య, లతీఫ్, అజీజ్, జానీ పాషా, జలీల్, సయ్యద్, రాంబాబు, రామకృష్ణ, మీరా, రవి, మధు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు రైల్వే లైన్, బుల్లెట్ ట్రైన్ సాధన కోసం నిర్వహిస్తున్న మౌన దీక్షకు జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన టీయూడబ్ల్యూజే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News