రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, టీవీలు, బైకులు స్వాధీనం.
సూర్యాపేట: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాకు ఆత్మకూర్ పోలీసులు చెక్ పెట్టారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, టీవీలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన ఆత్మకూర్ పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తును కేసుల దర్యాప్తులో భాగంగా నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
చోరీలపై పక్కా నిఘా ఏర్పాటు చేసి ముఠాను పట్టుకున్న ఆత్మకూర్ పోలీసులను ఎస్పీ అభినందించారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ రివార్డు అందజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి