జహీరాబాద్ బస్‌స్టాండ్‌లో తల్లులు తమ శిశువులకు ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు ఏర్పాటు చేసిన తల్లి–శిశు పాలిచ్చే గదిని జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత, శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాలు పోషించే పాత్రపై అవగాహన కల్పించారు. అనంతరం రచ్చన్నపేటలోని గౌరీ ప్యాలెస్‌లో పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు.శిశువు జీవితంలోని తొలి వెయ్యి రోజులు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయని,ఈ కాలంలో తల్లి, బిడ్డకు సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించాలని సూచించారు.స్థానికంగా లభించే ఆకుకూరలు,కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వివిధ రకాల పోషకాహార పదార్థాలతో ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి ప్రయోజనాలను వివరించారు. “పోషకాహారం – ఆరోగ్యకరమైన కుటుంబం – ఆరోగ్యకరమైన సమాజం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోషణ్ మాహ్ సందర్భంగా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో సీడీపీఓ సుశీల, జహీరాబాద్ తహసీల్దార్ దశరథ్, జిల్లా సమన్వయకర్త పల్లవి, సెక్టార్ పర్యవేక్షకులు, అంగన్‌వాడీ సిబ్బంది, సమన్వయకర్తలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్‌లో పోషణ్ మాహ్ సందడి.. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి