Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు

12-01-2026 337 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం:

ఇంద్రపాలనగరంలో కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా ముగ్గు పొడి, రంగులు పంపిణీ చేసి ముగ్గుల పోటీలను ప్రారంభించారు.

పోటీల్లో పాల్గొన్న మహిళలు రంగురంగుల ముగ్గులతో తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉత్తమ ముగ్గులు వేసిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయగా, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు.

సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాస్ ప్రదర్శనలు, బోగిమంటల ఏర్పాటు చేసి గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. సంప్రదాయ పండుగలను పరిరక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని గ్రామస్తులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, రైతులు, యువకులు, మహిళా సంఘాల అధ్యక్షురాలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News