Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:19 AM

హోళీ పర్వదినం సందర్భంగా 9వ వార్డు యువత ఆధ్వర్యంలో ఘన కామదాహనం

03-03-2026 475 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సోమవారం రాత్రి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలో వార్డు సభ్యులు మరియు యువత యువకుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కామదాహనం కార్యక్రమం జరిగింది. హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే ఈ కామదాహనం కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ 9వ వార్డు కౌన్సిలర్ బణపూర్ రాజు హాజరై పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హోళీ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.సమాజంలో ఐక్యత, స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి పండుగలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.కార్యక్రమం అనంతరం 9వ వార్డు సభ్యులు మరియు యువత యువకులు ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను శాంతి, సౌభ్రాతృత్వం, ఆనందాల మధ్య జరుపుకోవాలని కోరారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

Sthanikam

హోళీ పర్వదినం సందర్భంగా 9వ వార్డు యువత ఆధ్వర్యంలో ఘన కామదాహనం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సోమవారం రాత్రి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలో వార్డు సభ్యులు మరియు యువత యువకుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కామదాహనం కార్యక్రమం జరిగింది. హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే ఈ కామదాహనం కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ 9వ వార్డు కౌన్సిలర్ బణపూర్ రాజు హాజరై పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హోళీ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.సమాజంలో ఐక్యత, స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి పండుగలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.కార్యక్రమం అనంతరం 9వ వార్డు సభ్యులు మరియు యువత యువకులు ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను శాంతి, సౌభ్రాతృత్వం, ఆనందాల మధ్య జరుపుకోవాలని కోరారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News