Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

ఘనంగా చౌటుప్పల్‌ లో హోలీ సంబరాలు

ఘనంగా చౌటుప్పల్‌ లో హోలీ సంబరాలు

ఘనంగా చౌటుప్పల్‌ లో హోలీ సంబరాలు
03-03-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని రాంనగర్ కాలనిలో మంగళవారం హోలీ పండుగను కాలనీ వాసులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే రంగుల కేళి ప్రారంభమై, చిన్నా–పెద్దా అన్న తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణ వీధులన్నీ రంగులతో కళకళలాడుతూ పండుగ సందడి నింపాయి.యువత, మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత రంగులమయం చేశారు.చిన్నారులు గులాల్ రంగులతో ఆడిపాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాటలు, నృత్యాలతో కాలనీ అంతా పండుగ వాతావరణం అలుముకుంది.హోలీ పండుగ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని కాలనీ పెద్దలు పేర్కొన్నారు. పరస్పర కలహాలను మరచి స్నేహభావంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందన్నారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కాలనీ యువకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

Sthanikam

ఘనంగా చౌటుప్పల్‌ లో హోలీ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News