Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేద కుటుంబానికి సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ భరోసా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 03:15 PM

గీత కార్మికుల హామీలు అమలు చేయాలి.. కేజీకేఎస్‌ 69వ వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి.

07-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: గీత కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు డిమాండ్‌ చేశారు. బుధవారం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో కేజీకేఎస్‌ 69వ వార్షికోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ.. 1957 అక్టోబర్‌ 19న గార్లలో కల్లుగీత కార్మిక సంఘం ఏర్పాటైందని, నాటి నుంచి గీత కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. ఈ పోరాటాల స్ఫూర్తిని చాటుతూ ఈ నెల 14న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో 69వ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు గీత కార్మికులు, సొసైటీ అధ్యక్షులు, టీఎఫ్‌టీ బాధ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

పెన్షన్‌ రూ.10 వేలకు పెంచాలి

50 ఏళ్లు నిండిన గీత కార్మికులందరికీ పెన్షన్‌ ఇవ్వాలని, కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తి నిర్వహించే ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచం అందించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించడంతోపాటు వృత్తిలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలని అన్నారు.

ఈత, నీరా ప్రాజెక్టు ప్రారంభించాలి

చెట్ల పెంపకం కోసం ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి కేటాయించాలని, నల్లగొండ జిల్లాలో ఈత, నీరా, తాటి ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం నాయకులు నర్సింగ్‌ సైదులు, కాసాని సత్తయ్య, మాదా శ్రీనివాస్‌, కల్లూరి కంఠమహేశ్వర్‌, లింగయ్య, సోమయ్య, వెంకన్న, చిత్త లక్ష్మయ్య, చెట్ల నాగరాజు, పనస చంద్రయ్య, వనం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గీత కార్మికుల హామీలు అమలు చేయాలి.. కేజీకేఎస్‌ 69వ వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News