Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 10:28 AM

గ్రామసభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ శివశంకర్‌.

03-10-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తాజ్‌పూర్‌ అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక.

నీటి సంరక్షణకు పెద్దపీట.

జూన్‌ 2027 వరకు ఉపాధి పనులకు ముందస్తు కార్యాచరణ.

భువనగిరి: గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ పి.శివశంకర్‌ ఐఏఎస్‌ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని భువనగిరి మండలం తాజ్‌పూర్‌లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌ ర్యాకల సంతోష శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శివశంకర్‌, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నీటి వనరులే ప్రాధాన్యం.. గ్రామ అవసరాలు, సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని శివశంకర్‌ సూచించారు. వికసిత్‌ భారత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, బోర్‌ రీచార్జ్‌ పిట్లు, చెక్‌డ్యామ్‌లను గ్రామసభ ఆమోదంతో చేపట్టాలని సూచించారు.

కూలీలకు నిరంతర ఉపాధి.. వీబీ–జీ రామ్‌–జీ కార్యక్రమం కింద గ్రామంలోని కూలీలకు జూన్‌ 2027 వరకు నిరంతరం ఉపాధి కల్పించేలా పనులను ముందుగానే గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ఉపాధి పనులతోపాటు గ్రామీణ మౌలిక వసతులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పంట మార్పిడితో మేలు.. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ వర్షాధార పంటలపైనే ఆధారపడకుండా పంట మార్పిడిని చేపట్టాలని సూచించారు. జలసిరి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ఇంకుడు గుంతలు, వర్టికల్‌ సోక్‌పిట్లు, పాఠశాలలోని రూఫ్‌టాప్‌ రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్‌ను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రూపొందించిన సోషల్‌, రిసోర్స్‌ మ్యాప్‌లను పరిశీలించారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ చ.శ్రీనివాస్‌, ఎంపీడీఓ జి.విజయలక్ష్మి, ఎంపీవో దినకర్‌, ఉపసర్పంచ్‌ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామసభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ శివశంకర్‌.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News