Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:56 AM

గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

05-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ – అవగాహనతో ఆదర్శ గ్రామాల దిశగా అడుగులు

గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడవ విడతగా సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్), మునగాల, చివ్వేంల, పెన్‌పహాడ్ మండలాలకు చెందిన సర్పంచులకు శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామపంచాయతీ పనుల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ శిక్షణలో వివరంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి సర్పంచ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ప్రజా సౌకర్యాల మెరుగుదలకు ఆధునిక విధానాలను అవలంబించాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, వివిధ మండలాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News