Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 04:26 PM

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి

03-10-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉపసర్పంచుల చెక్ పవర్ ఆంక్షలు తొలగించాలి

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి - చిన్నం బాలరాజు

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని, ఉపసర్పంచుల చెక్ పవర్‌పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలరాజు డిమాండ్ చేశారు.

​నూతన పాలకవర్గాలు ఏర్పాటు అయి తొమ్మిది నెలలు గడుస్తున్నా, పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సైతం విద్యుత్ బిల్లుల పేరిట అధికారుల ద్వారా మళ్లించుకుంటూ గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి నిధుల కోసం సర్పంచులు, ఉపసర్పంచులు ఐక్యంగా ఉద్యమిస్తారనే భయంతోనే వారి మధ్య విభేదాలు సృష్టించే కుట్ర జరుగుతోందని బాలరాజు విమర్శించారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అవినీతికి తావులేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన జాయింట్ చెక్ పవర్‌పై, ఇప్పుడు 7 రోజుల్లోగా సంతకం చేయాలంటూ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఇది సర్పంచులు అవినీతికి పాల్పడేలా ప్రోత్సహించడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.​ఏదైనా ఉపసర్పంచ్ అకారణంగా సంతకం చేయకపోతే అధికారుల ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలే తప్ప, రాష్ట్రంలోని ఉపసర్పంచులందరిపై ఆంక్షలు మోపడం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానించడమేనన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, చెక్ పవర్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, ఉపసర్పంచులకు నెలకు రూ 5,000 గౌరవ వేతనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News