Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఎంఎంసీ కార్మికుడిపై దాడి.. నిందితులను అరెస్టు చేయాలి.

Updated : 07 Nov 2026 21:02 IST
As Preferred Source 1 min read
ఎంఎంసీ కార్మికుడిపై దాడి.. నిందితులను అరెస్టు చేయాలి.

అపస్మారక స్థితిలో బత్తుల బిక్షపతి.. మెరుగైన వైద్యం అందించాలని యూనియన్ నేతల డిమాండ్.

హయత్‌నగర్, నవంబర్ 7 (స్థానికం ప్రతినిధి):

హయత్‌నగర్‌లో ఎంఎంసీ కార్మికుడు బత్తుల బిక్షపతిపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆలేటి ఎల్లయ్య, సీఐటీయూ హయత్‌నగర్ సర్కిల్ కన్వీనర్ చింతపల్లి కృష్ణయ్య, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు ముషం నరహరి డిమాండ్ చేశారు.

హయత్‌నగర్‌లోని కృష్ణవేణి ఆసుపత్రి వెనుక రోడ్డులో ఎంఎంసీ కార్మికులు మొబైల్ పంచింగ్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్న సమయంలో కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో బత్తుల బిక్షపతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఈఎస్‌ఐ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఘర్షణకు కారణమైన వ్యక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు. సంబంధిత ఎంఎంసీ అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిక్షపతిని పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుడికి రావాల్సిన వేతనంతో పాటు వైద్య ఖర్చులు చెల్లించాలని, పేద కుటుంబానికి చెందిన బిక్షపతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

ఎంఎంసీ కార్మికుడిపై దాడి.. నిందితులను అరెస్టు చేయాలి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి