విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మునగాల మండలం ఎస్‌ఎంపేట రెవెన్యూ శివారులో సింగరేణి సంస్థ నిధులు రూ.9.60 కోట్లతో నిర్మించనున్న భారీ వంటశాల పనులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొందరికి మాత్రమే అభివృద్ధి పరిమితమైందని, తమ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబ సభ్యులని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి