Sthanikam - Truth Matters
Logo

ఏఐకేఎస్‌ మహాసభల విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు

Updated : 21 Nov 2026 19:45 IST
As Preferred Source 1 min read
ఏఐకేఎస్‌ మహాసభల విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు

 రైతులు, ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారనే విశ్వాసం కలిగింది

 మీడియా, వాలంటీర్లు, ప్రజలు, అధికార యంత్రాంగానికికృతజ్ఞతలు

 మీడియా సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నల్లగొండలో ఇటీవల నిర్వహించిన అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలు చారిత్రాత్మకంగా విజయవంతమయ్యాయని, ఈ మహాసభలు రైతాంగ ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయని ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మహాసభల విజయంతో రైతులు, ప్రజలు తమ వెనుక బలంగా ఉన్నారనే విశ్వాసం మరింత పెరిగిందని, భవిష్యత్తులో రైతాంగ, ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని నాయకులు ప్రకటించారు.

నల్లగొండ నగరంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీ ఐ ఎంజిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. మహాసభల విజయానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నల్లగొండ ఖ్యాతిని దేశవ్యాప్తం చేశాం : జూలకంటి రంగారెడ్డి

నల్లగొండలో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించడం జిల్లా ప్రజలందరూ గర్వించదగిన విషయమని ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మహాసభల నిర్వహణపై తొలినాళ్లలో అనేక సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయని, ఇంత పెద్ద కార్యక్రమానికి అవసరమైన వసతులు, ఆర్థిక వనరులు సమకూర్చగలమా? లక్ష మందిని సమీకరించగలమా? అనే ప్రశ్నలు వచ్చాయని గుర్తుచేశారు. అయితే రైతులు, ప్రజలు, వివిధ వర్గాల సహకారంతో వాటన్నింటినీ అధిగమించి మహాసభలను ఘనంగా నిర్వహించగలిగామని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, మధ్యతరగతి, సంపన్న వర్గాలు సైతం రైతుల సభగా భావించి సహకరించారని చెప్పారు. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, లాడ్జీల యజమానులు సరసమైన ధరలకు వసతులు కల్పించారని, వైద్యులు సేవలందించారని, మున్సిపల్‌ యంత్రాంగం, అగ్నిమాపక శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు సహకరించాయని వివరించారు. కలెక్టర్‌, మేయర్‌ అగ్రిషో ప్రారంభోత్సవంలో పాల్గొనడం, అధికారులు అందించిన సహకారం అభినందనీయమన్నారు. మహాసభల నిర్వహణలో అన్ని అనుమతులు తీసుకొని, నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

రైతులు, ప్రజలు పెద్దఎత్తున ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనడం గత పోరాటాల చరిత్రను గుర్తుచేసిందన్నారు. ఈ మహాసభలతో రైతుల్లో కదలిక, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, ప్రజలు తమ వెంట ఉన్నారనే నమ్మకం కలిగిందని చెప్పారు. భవిష్యత్తులో రైతాంగ, ప్రజా సమస్యలపై నిజమైన పోరాటాలు చేపడితే ప్రజలు పెద్దఎత్తున అండగా నిలుస్తారనే విశ్వాసం ఏర్పడిందన్నారు.

రైతాంగ సమస్యలపై 15 తీర్మానాలు.. దేశవ్యాప్త పోరాటాలు : ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి

మహాసభల ప్రచారాన్ని వంద రోజులుగా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ప్రతినిధులు జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. ర్యాలీ, బహిరంగ సభ, ప్రతినిధుల సభ, అగ్రిషో, ఎగ్జిబిషన్‌, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అనుకున్నదానికంటే విజయవంతమయ్యాయని తెలిపారు. సుమారు రెండు లక్షల రైతు కుటుంబాలు మహాసభకు సహకరించగా, నల్లగొండ జిల్లాలోనే లక్ష రైతు కుటుంబాలు భాగస్వాములయ్యాయని వివరించారు.

125స్టాళ్లతో నిర్వహించిన అగ్రిషో ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, శాస్త్రీయ సాగు పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, నీటి వినియోగం, విద్యుత్‌ తదితర అంశాలపై వేలాది మంది రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌, కార్టూన్లు, కళాకారుల ప్రదర్శనలు, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాటకం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో 15 తీర్మానాలు ఆమోదించామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే సమగ్ర చట్టం, పంట నష్టపరిహారం, పంటల బీమా, కల్తీలేని విత్తనాలు, ఎరువుల సరఫరా, రుణాలు, మార్కెట్‌ సౌకర్యాలు, వ్యవసాయ నిపుణుల నివేదికల అమలు వంటి అంశాలు వాటిలో ఉన్నాయన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ రైతాంగాన్ని విస్మరిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

తెలంగాణలో కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.50 వేల కోట్ల సహాయ నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కృష్ణా జలాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదని, సీడబ్ల్యూసీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం తప్పు చేసినా సరిదిద్దాలని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని అన్నారు.

ప్రజల ఆరోగ్యాలు, పంటలు, పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా బలవంతంగా ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మహాసభల నిర్వహణలో 6 వందల మంది వాలంటీర్లు, వంద రోజులుగా శ్రమించిన రైతు సంఘం, ప్రజాసంఘాల కార్యకర్తల కృషి మరువలేనిదని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

రైతు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఉధృతం : తుమ్మల వీరారెడ్డి

రాబోయే రోజుల్లో ప్రజలపై భారం పడే విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీపీఐ ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. జిల్లాలో పోడు భూములు, విద్య, మౌలిక వసతులు తదితర ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గత రుణాలను మాఫీ చేయడంతోపాటు కొత్త రుణాలు అందించాలని, వడ్డీ మాఫీ చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగంగా ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని అన్నారు.

మహాసభల విజయంతో రైతాంగంలో వచ్చిన చైతన్యాన్ని భవిష్యత్తు ఉద్యమాలకు ఉపయోగించుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. మహాసభలకు సహకరించిన మీడియా ప్రతినిధులు, వాలంటీర్లు, అధికారులు, ప్రజలు, ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల, బండ శ్రీశైలం, ఎండీ హాశం, పాలడుగు ప్రభావతి, ఎండీ సలీం, దండంపెల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏఐకేఎస్‌ మహాసభల విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి