Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిసాన్ మేళాకు రైతులు భారీగా తరలిరావాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 05:35 PM

దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి: సీఐ మన్మథ కుమార్

07-10-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత విగ్రహాల స్థాపన, ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వాహకుల సౌకర్యార్థం సమాచారం అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ​ఉత్సవ నిర్వాహకులు ముందుగా https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ​పోర్టల్‌లో కనిపిచే “Online Application” విభాగంపై క్లిక్ చేసి, తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.​దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్‌మెంట్ (Acknowledgement) రసీదును ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.​శాంతిభద్రతల పరిరక్షణ, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటంలో భాగంగానే ఈ సమాచారాన్ని సేకరిస్తున్నామని సీఐ తెలిపారు. చౌటుప్పల్ పరిధిలోని దుర్గామాత మండపాల నిర్వాహకులు, ప్రజలు ఈ ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించుకుని, తమ మండపాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.

Sthanikam

దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి: సీఐ మన్మథ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News