Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు.

Updated : 01 Nov 2026 18:47 IST
As Preferred Source 1 min read
భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు.

బోనాల సమర్పణలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి.

హయత్‌నగర్, నవంబర్ 1 (స్థానికం):

హయత్‌నగర్ గ్రామంలో శ్రీ నాభిశిల బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన బోనాల సమర్పణ కార్యక్రమంలో హయత్‌నగర్, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్రాయి పండుగ వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు గ్రామస్తులతో కలిసి పాల్గొని పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా హయత్‌నగర్ గ్రామ ప్రజలందరికీ బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి