Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:14 AM

దత్తాత్రేయ కాలనీవాసుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కామదహనం

03-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో హోలీ పండుగను ఘనంగా,ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల గాంధీ చౌక్ వద్ద దత్తాత్రేయ కాలనీ వాసులు ఆదివారం రాత్రి సంప్రదాయ పద్ధతిలో కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కట్టెలను పేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి శ్రద్ధలతో కామదహనం చేశారు.ఈ వేడుకలో కాలనీ పెద్దలు,యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పారు.ఈ కార్యక్రమంలో ముత్యాల మహేష్ కుమార్,ముత్యాల సురేష్ కుమార్, సారంగ్, బాలాజీ, శంకర్, ప్లైవుడ్ నారాయణ్ సింగ్, వడ్ల జ్ఞానేశ్వర్, కమ్మరి మల్లన్న, పూజారి శంకరప్ప, శివయ్య స్వామి పూజారి, ముత్యాల కిశోర్ కుమార్, వడ్ల రాములు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పూజారి వేదమంత్రాల మధ్య హోమాలు నిర్వహించి, గ్రామ సమాజం సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.మరుసటి రోజు మంగళవారం ఉదయం ఖేడ్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి హోలీ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగ సందర్బంగా స్నేహభావం, ఐకమత్యం మరింత బలపడింది.హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. కామదహనం ద్వారా చెడు ఆలోచనలు దహించబడి, మంచి భావనలు పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకలను నిర్వహించారు. మొత్తంగా నారాయణఖేడ్ పట్టణంలో హోలీ పండుగ ఆనందభరిత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

Sthanikam

దత్తాత్రేయ కాలనీవాసుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కామదహనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News