కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ఎస్పీ శరత్‌చంద్ర పవార్.
చిట్యాల: అరైవ్–అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ, సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఎన్‌హెచ్–65పై భారీ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, చూపు లోపాలు ఉన్న వారికి వైద్యుల సూచన మేరకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ డ్రైవర్ల కంటి చూపు, ఆరోగ్యం రోడ్డు భద్రతలో అత్యంత కీలకమన్నారు. అతివేగం, నిద్రమత్తు, మద్యం సేవించి డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటిస్తూ సురక్షిత దూరం, వేగ నియంత్రణతో ప్రయాణించాలన్నారు.
గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 350 మంది మృతి చెందగా, ఈ ఏడాది ఇప్పటివరకు హెల్మెట్ ధరించకపోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
కార్యక్రమంలో డీఎస్పీ కే.శివరాం రెడ్డి, ఎస్‌బీ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, విష్ణు, రిటైర్డ్ సీఐ అంజయ్య, సర్పంచ్ బొంత చంద్రారెడ్డి, సర్వేజన ఫౌండేషన్ ప్రతినిధి ప్రవీణ్‌కుమార్, డాక్టర్ ప్రదీప్, పోలీస్, వైద్య సిబ్బంది, లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి