Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:29 AM

చిన్నంపేట నుంచి కోటపాడు వరకు రోడ్డు పోసి ప్రజల ప్రాణాలు కాపాడండి మహాప్రభో కొమ్ము ఆనందం

06-03-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామానికి చెందిన దుగ్గిరాల రామకృష్ణ చిన్నంపేటలోని కోటపాడు రోడ్డులో ఉన్న తన పొలానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. చిన్నంపేట ఎస్సీ పేటలో అంగన్వాడీ కేంద్రం వద్ద రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో గోతిలో పడిపోయి ఆయన ఎడమ కాలు గుత్తిలో విరిగిపోయింది. తలకు కూడా గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సహాయం చేసి చికిత్స కోసం తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా సీపీఐ అనుబంధ చాట్రాయి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ చిన్నంపేట నుంచి కోటపాడు వెళ్లే రహదారి పూర్తిగా గోతులతో నిండిపోయిందని అన్నారు. ఈ రహదారిపై తరచూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతులు చేయించి పక్కాగా రోడ్డు వేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను ఆయన కోరారు.

Sthanikam

చిన్నంపేట నుంచి కోటపాడు వరకు రోడ్డు పోసి ప్రజల ప్రాణాలు కాపాడండి మహాప్రభో కొమ్ము ఆనందం

Article Image

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామానికి చెందిన దుగ్గిరాల రామకృష్ణ చిన్నంపేటలోని కోటపాడు రోడ్డులో ఉన్న తన పొలానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. చిన్నంపేట ఎస్సీ పేటలో అంగన్వాడీ కేంద్రం వద్ద రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో గోతిలో పడిపోయి ఆయన ఎడమ కాలు గుత్తిలో విరిగిపోయింది. తలకు కూడా గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సహాయం చేసి చికిత్స కోసం తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా సీపీఐ అనుబంధ చాట్రాయి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ చిన్నంపేట నుంచి కోటపాడు వెళ్లే రహదారి పూర్తిగా గోతులతో నిండిపోయిందని అన్నారు. ఈ రహదారిపై తరచూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతులు చేయించి పక్కాగా రోడ్డు వేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను ఆయన కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News