Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

చిన్నకాపర్తిలో ఇంటింటికీ సాగర్ నీళ్లు వేసవికి ముందస్తు చర్యలు

02-03-2026 817 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిన్నకాపర్తి, చిట్యాల మండలం: రానున్న వేసవిలో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలతో చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ముందడుగు వేసింది. ఇంటింటికీ సాగర్ నీళ్లు అందించాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రధాన పైప్‌లైన్‌లను మరమ్మతు చేయించడంతో పాటు గ్రామంలో మొత్తం ఐదు గేట్‌వాల్వులను అమర్చి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌ను సరిచేసి, 8వ వార్డులో రెండు గేట్‌వాల్వులు, 9వ వార్డులో ఒక గేట్‌వాల్వును నూతనంగా ఏర్పాటు చేసి ప్రారంభించారు.

ఈ చర్యలతో నీటి పంపిణీ మరింత సక్రమంగా జరుగుతుందని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రుద్రారపు లక్ష్మణ్, రొండి నర్సింహా, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, ఈరమళ్ళ దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, దేశాపాక మధు, పెర్కా నాగరాజు, మాజీ సర్పంచ్ వలిగొండ సోమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు నందిపటి మహేష్, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో అభివృద్ధి పనులు ఇదే విధంగా కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.

Sthanikam

చిన్నకాపర్తిలో ఇంటింటికీ సాగర్ నీళ్లు వేసవికి ముందస్తు చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News