Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

చెకుముకి పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ.. జిల్లా స్థాయికి ఎంపిక

Updated : 21 Nov 2026 19:44 IST
As Preferred Source 1 min read
చెకుముకి పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ.. జిల్లా స్థాయికి ఎంపిక

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో మునగాల మండల స్థాయి చెకుముకి పరీక్షలను శనివారం పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇంగ్లీష్ మీడియం విభాగంలో టీజీఎంఎస్ మునగాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవగా, జడ్పీ విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ నేలమర్రి విద్యార్థులు మొదటి స్థానాన్ని సాధించారు. వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె. వీరబాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలనా శక్తి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి. వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జె. రామకృష్ణ, బి.ఎస్. గౌడ్, వి. రవీందర్ రెడ్డి, ఎస్.కె. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో సహకరించారు.

Sthanikam

చెకుముకి పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ.. జిల్లా స్థాయికి ఎంపిక

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి