చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టుకు నూతన జూనియర్ సివిల్ జడ్జిగా ఎం.డి. గౌస్ పాషా నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీన బాధ్యతలు స్వికరించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.డి. గౌస్ పాషాను చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జడ్జి ఎం.డి. గౌస్ పాషా ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహ్మరెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడారు. చౌటుప్పల్ కోర్టులో ప్రభుత్వ కేసుల నిర్వహణ, పురోగతి ఎలా ఉందని ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రభుత్వ కేసుల విచారణ, వాటి పురోగతి తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి పాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి