Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 06:00 AM

చౌటుప్పల్ డివిజన్‌లో 1104 యూనియన్ మే డే వేడుకలు

చౌటుప్పల్ డివిజన్‌లో 1104 యూనియన్ మే డే వేడుకలు

చౌటుప్పల్ డివిజన్‌లో 1104 యూనియన్ మే డే వేడుకలు
May 01, 2026 02:46 PM 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ డివిజన్ పరిధిలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించి కార్మికుల ఐక్యతను చాటారు.

డివిజన్ అధ్యక్షుడు అల్లే రమేష్, కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి తిరుమలయ్య, సీనియర్ నాయకులు షకీల్, సుధాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

డివిజన్ పరిధిలోని రామన్నపేట, వలిగొండ, నారాయణపురం, పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వేర్వేరు సెక్షన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక యూనియన్ నాయకులు జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా కార్యదర్శి గంగుల సోమేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం 1104 యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణలో యూనియన్ ముందుంటుందని స్పష్టం చేశారు.

కార్యక్రమాల్లో యూనియన్ నాయకులు, సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News