Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:15 AM

బోరంచ గ్రామంలో రంగుల సందడి – హోళీ సంబరాలు ఘనంగా

03-03-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో ఉన్న బోరంచ గ్రామంలో హోళీ పండుగ సందర్భంగా మంగళవారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తులు,యువత,యువకులు,చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.వాడవాడలా రంగుల హారతులతో,రకరకాల కలర్స్ చల్లుకుంటూ, పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూ గ్రామమంతా హోళీ సంబరాలతో కళకళలాడింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఒక్కటిగా కలిసి పరస్పరం రంగులు చల్లుకుంటూ స్నేహసౌహార్దాలను పంచుకున్నారు.గ్రామంలో ఎక్కడ చూసినా ఆనంద కిలకిలారావాలు మార్మోగాయి.అనంతరం గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అందరినీ ఆశీర్వదిస్తూ, ఐక్యత మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకగా హోళీ పండుగను జరుపుకోవాలని సూచించారు.గ్రామంలోని ప్రతి కుటుంబానికి హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యతను,ప్రేమను,స్నేహాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.బోరంచ గ్రామంలో హోళీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి.

Sthanikam

బోరంచ గ్రామంలో రంగుల సందడి – హోళీ సంబరాలు ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News