Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

భువనగిరిలో గల్లి గల్లిలో ఘనంగా హోలీ సంబరాలు

04-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రంగుల సందడి

భువనగిరి పట్టణంలో హోలీ పండుగను ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుతూ, బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ...సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మన భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు ఎంతో గొప్పవని, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన పరమార్థం ఉందని పేర్కొన్నారు. హోలీ పండుగ అన్ని రంగుల సమ్మేళనంగా, ఆనందం-సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భువనగిరి పట్టణంలో వాడవాడలా బైక్ ర్యాలీలతో తిరుగుతూ.. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

పట్టణమంతా రంగుల హరివిల్లు విరిసినట్టుగా కనిపించగా,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు కార్యకర్తలు,యువత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో గల్లి గల్లిలో ఘనంగా హోలీ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News