Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:46 AM

భువనగిరి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం

21-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

చేనేత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తా...నూతన అధ్యక్షులు ఏలే సుధాకర్

భువనగిరి పట్టణంలోని స్థానిక చేనేత పారిశ్రామిక సహకార సంఘం కార్యాలయంలో సోమవారం నూతన కార్యవర్గం పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా భువనగిరి చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఏలే సుధాకర్,ఉపాధ్యక్షుడిగా తిరందాసు దానయ్య,కార్యదర్శిగా గర్థాసు చంద్రమౌళి బాధ్యతలు స్వీకరించారు.అలాగే పాలకవర్గ డైరెక్టర్లుగా గర్దాస్ వెంకటేశం,అందె రాములు,యెలగందుల హరినాథ్,బడుగు శ్రీనివాస్,గర్దాసు మునెమ్మ,గర్దాసు లలిత బాధ్యతలు చేపట్టారు. సంఘం మేనేజర్‌గా బర్రెంకల రమేష్ కొనసాగుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ అధికారి ఆధ్వర్యంలో,మున్సిపల్ చైర్‌పర్సన్ చేతుల మీదుగా నూతన పాలకవర్గ సభ్యులు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ...చేనేత రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం,ఆధునిక మార్కెటింగ్ అవకాశాల కల్పనతో పాటు చేనేత అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన కార్యవర్గం సభ్యులు సంఘ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేసి చేనేత కార్మికుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిలుక నాగరాజు వందన సమర్పణ చేశారు.బి.జ్యోతి,చేనేత జౌళి శాఖ ఏడీఓ,భువనగిరి చేనేత సహకార సంఘాల క్లస్టర్ సీడీఈ బిర్రు సంతోష్,మాజీ డైరెక్టర్లు కస్తూరి శ్రీనివాస్,అందే కృష్ణ,34వ వార్డు కౌన్సిలర్ సరగడ రాజ్యలక్ష్మి అమర్,10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్,పీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్,ఎక్స్ అఫీషియో సభ్యుడు బడుగు శంకర్,కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కూర వెంకటేష్,భువనగిరి చేనేత సహకార సంఘం సభ్యులు,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News