Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

భూముల రీ సర్వే పూర్తిగా ఉచితం.. దళారులను నమ్మవద్దు – తహసీల్దార్ గంగాభవాని

Updated : 02 Nov 2026 18:10 IST
As Preferred Source 1 min read
భూముల రీ సర్వే పూర్తిగా ఉచితం.. దళారులను నమ్మవద్దు – తహసీల్దార్ గంగాభవాని

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని సిద్ధహంగీర్గా, ఎన్కేమూవీ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గంగాభవాని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూముల రీ సర్వే ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఆయా గ్రామాల రైతులందరూ సంబంధిత సర్వేయర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ రీ సర్వే కార్యక్రమం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు. రీ సర్వే పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, దళారుల మాటలు విని మోసపోవద్దని రైతులకు సూచించారు. భూముల రీ సర్వే కోసం ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులందరూ అధికారులకు సహకరించి రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ గంగాభవాని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

భూముల రీ సర్వే పూర్తిగా ఉచితం.. దళారులను నమ్మవద్దు – తహసీల్దార్ గంగాభవాని

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని సిద్ధహంగీర్గా, ఎన్కేమూవీ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గంగాభవాని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూముల రీ సర్వే ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఆయా గ్రామాల రైతులందరూ సంబంధిత సర్వేయర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ రీ సర్వే కార్యక్రమం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు. రీ సర్వే పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, దళారుల మాటలు విని మోసపోవద్దని రైతులకు సూచించారు. భూముల రీ సర్వే కోసం ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులందరూ అధికారులకు సహకరించి రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ గంగాభవాని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి