Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 06:33 PM

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సేవలు భేష్.

07-10-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

25 లక్షల మందికి విద్యావకాశాలు.. 38 బంగారు పతకాలు ప్రదానం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 స్థానికం ప్రతినిధి:

గ్రామీణ, మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని గవర్నర్‌, యూనివర్సిటీ ఛాన్సలర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన 27వ స్నాతకోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు, బుక్‌ ప్రైజ్‌లు అందజేశారు.

నర్సింగ్‌రావుకు గౌరవ డాక్టరేట్‌

ప్రముఖ సినీ దర్శకుడు, కవి, నటుడు బి. నర్సింగ్‌రావుకు గవర్నర్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఇప్పటివరకు 25 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించిందన్నారు. ‘సమత’ పథకం ద్వారా నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య అందించడం అభినందనీయమన్నారు. డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించుకుని విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ డిజిటల్‌ సాంకేతికతతో సామాజిక లక్ష్యాలను మేళవించి సమ్మిళిత, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలకు విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

38 బంగారు పతకాలు

స్నాతకోత్సవంలో 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డీ, ఒకరికి ఎంఫిల్‌ పట్టాలు ప్రదానం చేశారు. యూజీలో 16, పీజీలో 22 కలిపి మొత్తం 38 బంగారు పతకాలు అందజేశారు. వీటిలో మహిళలు 29, పురుషులు 9 మంది ఉన్నారు. మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల పట్టాలు ప్రదానం చేశారు.

ఖైదీకి గోల్డ్‌ మెడల్‌.. బుక్‌ ప్రైజ్‌

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చెందిన ఖైదీ నుకపెయ్యి సురేష్‌ అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పతకంతోపాటు బుక్‌ ప్రైజ్‌ అందుకున్నారు. యూజీ విద్యార్థిని బొజ్జనపల్లి శ్రీ ఆశ్రిత మూడు బంగారు పతకాలు సాధించారు. కడియాల సాయిభాను, హజీరా బేగం, శివపార్వతి చిప్పల రెండేసి పతకాలు అందుకున్నారు. పీజీలో మంతెన శ్రీదేవి, తోట శ్వేత రెండేసి బంగారు పతకాలు సాధించారు.

కార్యక్రమంలో న్యాక్‌ పూర్వ డైరెక్టర్‌ ప్రొ. వి.ఎస్‌. ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డా. ఎల్‌. విజయకృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు, డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సేవలు భేష్.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News