Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:21 PM

14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం.!

23-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణే లక్ష్యం..

రూ. 10 వేల విలువైన వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ డీఎంహెచ్ఓ డా. రాహుల్..

నల్గొండ : మహిళల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌమార దశలో ఉన్న 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా పూర్తి రక్షణ పొందవచ్చని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలికలకు ఈ టీకా అందేలా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు.

రూ. 10 వేల వ్యాక్సిన్ పూర్తిగా ఉచితం...

​సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు రూ. 10,000 వరకు ఖర్చు అవుతుందని, అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ టీకా అత్యంత సురక్షితమైనదని, ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అర్హులైన ప్రతి బాలికకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించి, సర్వైకల్ క్యాన్సర్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం సహకరించాలని డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు.

Sthanikam

14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం.!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News