Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

13వ వార్డులో ఘనంగా హోలీ సంబరాలు

13వ వార్డులో ఘనంగా హోలీ సంబరాలు

13వ వార్డులో ఘనంగా హోలీ సంబరాలు
03-03-2026 219 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో హోలీ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి రంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఉదయం నుంచే రంగుల కేళి ప్రారంభమై, చిన్నా–పెద్దా అన్న తేడా లేకుండా ఒకరిపై ఒకరు గులాల్ చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు మరింత రంగులు అద్దారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ పరస్పర ప్రేమ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక యువకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.13వ వార్డులో హోలీ సంబరాలు స్నేహభావ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

Sthanikam

13వ వార్డులో ఘనంగా హోలీ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News