Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

విషాదం: కోతుల బెడదకు బాలుడి బలి! వల్లాపురంలో 12 ఏళ్ల బాలుడి మృతి.. గ్రామంలో విషాదఛాయలు.

Updated : 24 Oct 2026 05:37 IST
As Preferred Source 1 min read
విషాదం: కోతుల బెడదకు బాలుడి బలి! వల్లాపురంలో 12 ఏళ్ల బాలుడి మృతి.. గ్రామంలో విషాదఛాయలు.

సూర్యాపేట జిల్లా: తెలంగాణలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పలు గ్రామాల్లో ప్రజలపై కోతులు దాడులు చేస్తుండటంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా వల్లాపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన నిశాంక్ (12) తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కోతులు అతడిని వెంటపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన బాలుడు కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడి గుండె ఆగిపోయినట్లు సమాచారం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.

ఈ ఘటనతో వల్లాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామాల్లో కోతుల బెడదను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

విషాదం: కోతుల బెడదకు బాలుడి బలి! వల్లాపురంలో 12 ఏళ్ల బాలుడి మృతి.. గ్రామంలో విషాదఛాయలు.

Article Image

సూర్యాపేట జిల్లా: తెలంగాణలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పలు గ్రామాల్లో ప్రజలపై కోతులు దాడులు చేస్తుండటంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా వల్లాపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన నిశాంక్ (12) తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కోతులు అతడిని వెంటపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన బాలుడు కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడి గుండె ఆగిపోయినట్లు సమాచారం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.

ఈ ఘటనతో వల్లాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామాల్లో కోతుల బెడదను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి