Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం

Updated : 24 Oct 2026 14:10 IST
As Preferred Source 1 min read
సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం

మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా

స్థానికం చైతన్యపురి: సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శనివారం (అక్టోబర్ 24) ఉదయం 8.35 గంటల సమయంలో డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో సరూర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చెరువులోని మృతదేహాన్ని వెలికితీయించారు. ప్రాథమిక పరిశీలనలో మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని గుర్తించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి శరీరం నీటిలో ఎక్కువకాలం ఉండటంతో ఉబ్బిపోయిందని, చర్మంపై మార్పులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

పచ్చబొట్ల ఆధారంగా గుర్తించే ప్రయత్నం

మృతుడి గుర్తింపునకు సంబంధించి పోలీసులు వివరాలను వెల్లడించారు. కుడి చేతిపై సత్తమ్మ, జ్యోతి, ఇ. రవి పేర్లతో పచ్చబొట్లు ఉండగా, ఎడమ చేతిపై అండాలు, సత్తమ్మ, మహాలక్ష్మి పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. మెడలో నల్లటి దారానికి రుద్రాక్ష మాల, నడుముకు ఎరుపు రంగు మొలతాడు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సరూర్‌నగర్‌ సీఐ శ్రీశైలం తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు లేదా అతడి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆచూకీ గుర్తించినవారు సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Sthanikam

సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి