Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

హోటీ (కె)లో ఖబరస్థాన్‌ అభివృద్ధికి శ్రీకారం.. శంకుస్థాపన చేసిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Updated : 24 Oct 2026 14:23 IST
As Preferred Source 1 min read
హోటీ (కె)లో ఖబరస్థాన్‌ అభివృద్ధికి శ్రీకారం.. శంకుస్థాపన చేసిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హోటీ (కె) గ్రామంలో ఈద్గా ఖబరస్థాన్‌ అభివృద్ధి కోసం కేటాయించిన ఐదు ఎకరాల భూమికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ శంకుస్థాపన చేశారు.ఖబరస్థాన్‌ అభివృద్ధికి చేపట్టిన ఈ కార్యక్రమం ముస్లిం సమాజానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన ముందడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్, కౌన్సిలర్ జహంగీర్ ఖురేషీ, న్యాయవాది మహమ్మద్ జమీల్, చౌహాన్‌తో పాటు ప్రముఖ ఇస్లామిక్ పండితులు మౌలానా ముజీబ్ ఖాస్మీ, మౌలానా సుబూర్ ఖాస్మీ పాల్గొన్నారు. అలాగే ఈద్గా కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ మజీద్, మహమ్మద్ ఇనాయత్ అలీ, మహమ్మద్ మొయిజుద్దీన్, మహమ్మద్ వసీం అక్రమ్, మహమ్మద్ ఫసియుద్దీన్, అయూబ్ ఖాన్, మొయిన్ ఫిరోజ్, హిసాముద్దీన్ ముజాహిద్‌తో పాటు పలువురు రాజకీయ, సామాజిక నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. జహీరాబాద్, హోటీ (కె), షేకాపూర్, కోహీర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మతపెద్దలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువత ఒకే వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈద్గా ఖబరస్థాన్‌ అభివృద్ధికి చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రముఖులకు, ఈద్గా కమిటీ సభ్యులకు, కమ్యూనిటీ ప్రతినిధులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ జజాకల్లాహు ఖైరన్ అని పేర్కొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి