3,617 వాహనాలు, 3,448 మంది తనిఖీ.. 28 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు.
మల్కాజిగిరి, అక్టోబర్ 24: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు అక్టోబర్ 22న రాత్రి ‘సీల్–ఎం’ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మూడు జోన్ల పరిధిలోని 54 చెక్‌పోస్టుల వద్ద 1,098 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా 3,617 వాహనాలు, 3,448 మందిని తనిఖీ చేశారు. మోటారు వాహనాల చట్టం కింద 365 కేసులు, 28 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. 126 వాహనాలను స్వాధీనం చేసుకుని, 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలకు సంబంధించిన 20 స్వాధీనాల కేసులు నమోదు చేయడంతో పాటు 118 పెట్టీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
జోన్‌ల వారీగా ఎల్‌బీనగర్‌లో 186, మల్కాజిగిరిలో 97, ఉప్పల్‌లో 82 మోటారు వాహనాల చట్టం కేసులు నమోదయ్యాయి. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ చెక్‌పోస్టు వద్ద సరైన పత్రాలు లేని వాహనంలో 67 సరుకు పెట్టెలను గుర్తించారు. వాటి రవాణా చట్టబద్ధతపై మరింత విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసుల నివేదిక పేర్కొంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి