Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

అంబులెన్స్‌లోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రోషిణి

Updated : 24 Oct 2026 10:44 IST
As Preferred Source 1 min read
అంబులెన్స్‌లోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రోషిణి

తల్లి, బిడ్డ క్షేమం.. అంబులెన్స్ సిబ్బందికి కుటుంబ సభ్యుల అభినందనలు.

రంగారెడ్డి జిల్లా: ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలోనే గర్భిణికి ప్రసవం జరిగింది. గౌలిదొడ్డికి చెందిన రోషిణి (25) తన మొదటి కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్తుండగా, అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో బొడ్డు తాడు శిశువు మెడకు చుట్టుకున్నప్పటికీ, అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం తల్లి, బిడ్డను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవానికి సహకరించిన అంబులెన్స్ టెక్నీషియన్ జి. నరేష్, డ్రైవర్ బి. బాలకృష్ణలను కుటుంబ సభ్యులు అభినందించారు.

Sthanikam

అంబులెన్స్‌లోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రోషిణి

Article Image

తల్లి, బిడ్డ క్షేమం.. అంబులెన్స్ సిబ్బందికి కుటుంబ సభ్యుల అభినందనలు.

రంగారెడ్డి జిల్లా: ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలోనే గర్భిణికి ప్రసవం జరిగింది. గౌలిదొడ్డికి చెందిన రోషిణి (25) తన మొదటి కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్తుండగా, అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో బొడ్డు తాడు శిశువు మెడకు చుట్టుకున్నప్పటికీ, అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం తల్లి, బిడ్డను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవానికి సహకరించిన అంబులెన్స్ టెక్నీషియన్ జి. నరేష్, డ్రైవర్ బి. బాలకృష్ణలను కుటుంబ సభ్యులు అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి