కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక సమాచారం.
శివన్నగూడెం: నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సుంకరి ఇంద్రయ్య (40) తన భార్య రజితను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి