హుజూర్‌నగర్‌లో ఎన్‌ఎస్‌పీ కాల్వ భూముల రికార్డుల పరిశీలనలో లోపాలు.
సూర్యాపేట: భూ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. హుజూర్‌నగర్ రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సస్పెండ్ చేశారు.హుజూర్‌నగర్ మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి ప్రాథమిక విచారణ చేపట్టారు.
ఎన్‌ఎస్‌పీ కాల్వ భూముల రికార్డుల పరిశీలనలో లోపాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతోపాటు, రికార్డులను సక్రమంగా పరిశీలించకుండానే తప్పుడు ధ్రువీకరణ నివేదిక సమర్పించారనే అభియోగాలు నమోదయ్యాయి.ఈ వ్యవహారంపై ఆర్డీవో సమర్పించిన నివేదిక ఆధారంగా ఎంఆర్‌ఓ కవిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కాశీం షరీఫ్, జీపీఓ ఎస్‌కే జానీ పాషాపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. భూ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, విధుల నిర్వహణలో లోపాలపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి