Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

విజయ్ ప్రమాణ స్వీకారంపై నూర్ అహ్మద్ అభినందనలు

10-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత దళపతి సి. జోసెఫ్ విజయ్‌కు ఎంహెచ్‌పీఎస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తమిళ ప్రజలకు, టీవీకే పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అత్యంత సాధారణ వ్యక్తులను ఎమ్మెల్యేలుగా గెలిపించడం, ఓటుకు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికల్లో విజయం సాధించడం విశేషమన్నారు. కుల, మత రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా విజయ్ ప్రజాభిమానాన్ని పొందారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ముఖ్యంగా 26 సంవత్సరాల లోపు యువత పెద్దఎత్తున విజయ్‌కు మద్దతుగా నిలవడం యువత మార్పు, స్వచ్ఛమైన రాజకీయాలను కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. మెజారిటీ కోసం అడ్డదారులు తొక్కకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు.

తమిళనాడులో విజయ్ పాలన దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Sthanikam

విజయ్ ప్రమాణ స్వీకారంపై నూర్ అహ్మద్ అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News