తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ఈ నెల 27న నిర్వహించనున్న చలో యాదగిరిగుట్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం గోడపత్రికను ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, రూ.25 వేల పింఛన్ తదితర హామీలను అమలు చేయాలని కోరుతూ చలో యాదగిరిగుట్ట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎస్కే చాంద్, బందెల రాములు, రెబ్బాసు రాములు, నోముల శంకర్, బొడ్డుపల్లి లింగయ్య, చిందం లింగయ్య, గొలుసుల ప్రసాద్, మర్రి పరమేష్, ఏలూరి రవి, ఎండి అజార్, యాదాసు లక్ష్మణ్, ఆవుల నరేందర్, నంగునూరి విజయ్, బోయ సైదులు, కైరంకొండ సంతోష్, డాక్టర్ నకిరేకంటి అశోక్, డాక్టర్ కొండ మల్లేష్ గౌడ్, మందడి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి