జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం కోదాడ టిఎన్జిఓఎస్ యూనిట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాల ద్వారా దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి దేశ సేవ, నిజాయితీ, నిరాడంబరత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. దేశ అభివృద్ధి కోసం వారు చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జిఓఎస్ కోదాడ యూనిట్ అధ్యక్షులు జి చిరంజీవి, సెక్రటరీ పొలంపల్లి వెంకట్ నాగేష్, ట్రెజరర్ మట్టపల్లి మహేష్, వైస్ ప్రెసిడెంట్ గంటెపొంగు విక్రమ్, ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం స్రవంతి, వార్డెన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సిహెచ్ పద్మ, మహేశ్వరి, ఏఈవో, టిఎన్జిఓఎస్ హుజూర్‌నగర్ మాజీ అధ్యక్షులు అశోక్, చైతన్య, బాలాజీ, కొండపల్లి క్రాంతి, పులి శ్రీనివాస్ తదితర టిఎన్జిఓఎస్ సీనియర్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను స్మరించుకుంటూ, వారి సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి