తాజ్ పూర్
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో కార్తీక మహోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ త్రిలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీకమాస దీప ఉత్సవాలను గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా
ఘనంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకే భక్తులు తెల్లవారుజామునే పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్తీక మహోత్సవానికి రాష్ట్రం నుంచి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ ఎస్ కె ఫౌండేషన్ చైర్మన్ ర్యాకల శ్రీనివాస్, దేవాలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తలు, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి