Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

తెలంగాణ వేడుకల్లో ఫ్లెక్సీ గందరగోళం. సీఎం ఫొటో కింద డీఈవో పేరు.. మంత్రి ఫొటోకు కలెక్టర్ హోదా!

02-06-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విద్యాశాఖ స్టాల్‌లో ప్రముఖుల ఫొటోల కింద తప్పుగా పేర్లు, హోదాలు ముద్రించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు.

ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పేరు ముద్రించగా, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ హోదాను పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమానికి వచ్చిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ తప్పిదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు విద్యాబోధన చేసే శాఖే అధికారిక కార్యక్రమంలో ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీ తయారీ నుంచి ప్రదర్శన వరకు ఎవరూ పరిశీలించలేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి తప్పిదంగా కాకుండా శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ఘటనగా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఫ్లెక్సీ ఏర్పాటులో బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

తెలంగాణ వేడుకల్లో ఫ్లెక్సీ గందరగోళం. సీఎం ఫొటో కింద డీఈవో పేరు.. మంత్రి ఫొటోకు కలెక్టర్ హోదా!

Article Image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విద్యాశాఖ స్టాల్‌లో ప్రముఖుల ఫొటోల కింద తప్పుగా పేర్లు, హోదాలు ముద్రించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు.

ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పేరు ముద్రించగా, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ హోదాను పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమానికి వచ్చిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ తప్పిదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు విద్యాబోధన చేసే శాఖే అధికారిక కార్యక్రమంలో ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీ తయారీ నుంచి ప్రదర్శన వరకు ఎవరూ పరిశీలించలేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి తప్పిదంగా కాకుండా శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ఘటనగా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఫ్లెక్సీ ఏర్పాటులో బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News