Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:10 AM

సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా టి.ఎల్. సంగీత పదవీ బాధ్యతలు స్వీకారం

06-05-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా టి.ఎల్. సంగీత బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టగా, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా, ఆమె అధికారులతో సన్నిహితంగా పరిచయం చేసుకుని శాఖల వారీగా జరుగుతున్న పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టి.ఎల్. సంగీత మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థంగా చేరేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని పేర్కొన్నారు.

Sthanikam

సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా టి.ఎల్. సంగీత పదవీ బాధ్యతలు స్వీకారం

Article Image

సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా టి.ఎల్. సంగీత బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టగా, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా, ఆమె అధికారులతో సన్నిహితంగా పరిచయం చేసుకుని శాఖల వారీగా జరుగుతున్న పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టి.ఎల్. సంగీత మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థంగా చేరేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News