Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 08:44 PM

శాంతి, అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ

02-10-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

శాంతి, అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ..

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ0లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. ఆయన చూపిన అహింసా మార్గం నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను, సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనేబోయిన శ్రీకాంత్, సింగల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఏపీవో కృష్ణయ్య, పాలకవర్గ సభ్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

శాంతి, అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ

Article Image

శాంతి, అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ..

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ0లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. ఆయన చూపిన అహింసా మార్గం నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను, సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనేబోయిన శ్రీకాంత్, సింగల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఏపీవో కృష్ణయ్య, పాలకవర్గ సభ్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News