Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఈవో చిట్టెడి వెంకట్ రెడ్డి, పరిశీలకులు నిఖిల్

Updated : 24 Oct 2026 16:55 IST
As Preferred Source 1 min read
శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఈవో చిట్టెడి వెంకట్ రెడ్డి, పరిశీలకులు నిఖిల్

దేవస్థాన షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్ల పరిశీలన

త్వరలోనే కొత్త టెండర్లు వేస్తామని ఈవో ప్రకటన

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మల్కాపూర్ గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) చిట్టెడి వెంకట్ రెడ్డి, ప్రత్యేక పరిశీలకులు ఎన్.నిఖిల్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజు శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈవో చిట్టెడి వెంకట్ రెడ్డి, పరిశీలకులు నిఖిల్ దేవస్థానం ఆధీనంలో ఉన్న వాణిజ్య షట్టర్లను (దుకాణాలను) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ... ఆలయ ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు దేవస్థానం షట్టర్లకు త్వరలోనే నూతన టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు సిలువేరు శంకర్, దౌడి లింగస్వామి, ఎల్లంకి లింగాచారి, ఎక్స్ అఫీషియో మెంబర్ పెద్ది శ్రీధర్ శర్మ, వార్డు మెంబర్ ఈడుదల ఇంద్రసేన యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పక్కిర్ ప్రభాకర్ రెడ్డి, పలువురు భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఈవో చిట్టెడి వెంకట్ రెడ్డి, పరిశీలకులు నిఖిల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి