సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన.. వల్లాపురంలో ఘటన
సూర్యాపేట జిల్లాలో కోతుల దాడికి 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.
గ్రామానికి చెందిన మొక్క వీరబాబు కుమారుడు నిశాంక్ గౌడ్ (12) శనివారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కోతుల గుంపు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వల్లాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రామాల్లో కోతుల సంచారం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి