సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట గ్రామంలో దేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమని, ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలైన మన్నె పద్మ–కృష్ణ దంపతులకు సైకిల్‌ను బహూకరించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసిన గ్రామస్తులను అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవి సింగ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ మమత, మాజీ ఉపసర్పంచ్ సుభాన్, జుట్టు హరిచందర్ రెడ్డి, కోలుకుందె వెంకట్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాందాపురం విట్టల్, జగన్నాథ్ రెడ్డి, చెప్పు వెంకట్, బెలూరు వెంకట్ రెడ్డి, భవానీ మాత అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గామాత నామస్మరణలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తుల సందడి మధ్య నిమజ్జనోత్సవం ఉత్సాహంగా కొనసాగింది.
ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పులిమామిడి రాజు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి