చౌటుప్పల్ కాంగ్రెస్ మున్సిపల్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం
20 వార్డుల్లో నూతన కమిటీలు.. త్వరలో బూత్ కమిటీల ఏర్పాటు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఇప్పటికే నూతన కమిటీలను పూర్తి చేయగా, రాబోయే రోజుల్లో ప్రతి బూత్ స్థాయిలోనూ బలమైన కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనబెట్టి ఐకమత్యంతో, సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, బ్లాక్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, వైస్ చైర్మన్ శివారెడ్డి, మాజీ మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహా గౌడ్, రామాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, మున్సిపల్ కమిటీ ప్రధాన కార్యదర్శులు ఇప్ప వెంకటేష్, ఎర్రగోని లింగస్వామి యాదవ్, ఉపాధ్యక్షులు వెంకట్ కుమార్, అంతటి విజయలక్ష్మి బాలరాజు, చెరుకు లింగస్వామి, బండమీది మల్లేష్, ఎండి వహీద్, అధికార ప్రతినిధి శ్యామకూర యాదయ్య, కార్యదర్శులు మాదాని గోపాల్, గుండబోయిన మనిత ఐలయ్య యాదవ్, ఓర్సు శ్రీజా రాజు, ఎండి ఫరోజ్, దుబ్బాటి దయాకర్ రెడ్డి, బత్తుల రాజు, జక్కర్తి సుధా, సుమతి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి