చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో విడత 'ఇందిరమ్మ ఇండ్ల' కేటాయింపులో ఎలాంటి పక్షపాతం లేకుండా నిజమైన అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలని సమాచార హక్కు రక్షణ చట్టం - 2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దబ్బటి శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.సమగ్ర విచారణ జరిపించాలిరెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఆయన కోరారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.పేదల కల నెరవేరాలి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, నివాసం లేని నిజమైన నిరుపేదలకే ఈ ఇండ్లను కేటాయించాలని అధికారులకు, రాజకీయ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి