Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
షార్ట్‌ఫిల్మ్‌లో సత్తా.. ఉపేందర్‌కు రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 09:03 PM

షార్ట్‌ఫిల్మ్‌లో సత్తా.. ఉపేందర్‌కు రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి

26-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, సెప్టెంబర్ 26:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌కు చెందిన యువ టూరిజం క్లబ్ విద్యార్థి ఉపేందర్ షార్ట్‌ఫిల్మ్ పోటీలో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని షిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఉపేందర్ అవార్డును అందుకున్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో జీడీసీ హయత్‌నగర్‌కు చెందిన సుమారు 100 మంది యువ టూరిజం క్లబ్ విద్యార్థులు రెండు బస్సుల్లో అధ్యాపకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటక పోటీలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.

సందర్శన ద్వారా విద్యార్థులకు పర్యాటకం, చారిత్రక వారసత్వం, కళలు, హస్తకళలు, తెలంగాణ సంస్కృతి తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కలిగింది. పర్యాటక రంగంలో యువత పాత్రపై నిర్వహించిన కార్యక్రమాలు విద్యార్థులకు విలువైన అనుభవాన్ని అందించాయి.

ఉపేందర్‌కు అభినందనలు

షార్ట్‌ఫిల్మ్ పోటీలో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థి ఉపేందర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్‌బాబు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ యువ టూరిజం క్లబ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో మ్యూజియమ్స్ శాఖ డైరెక్టర్ (ఎఫ్‌ఏసీ) ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి ప్రసంగిస్తూ పర్యాటక రంగ అభివృద్ధి, చారిత్రక వారసత్వ పరిరక్షణ, తెలంగాణ సంస్కృతి, పర్యాటక రంగంలో యువత భాగస్వామ్యంపై వివరించారు.

కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ మెహబూబ్, కళాశాల కో-ఆర్డినేటర్ డాక్టర్ నోముల వెంకటేశ్వర్లు, డాక్టర్ కృష్ణమోహన్, లెఫ్టినెంట్ డాక్టర్ ధన్‌రాజ్, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యువతను పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేస్తున్న కళాశాల బృందాన్ని పలువురు అభినందించారు.

Sthanikam

షార్ట్‌ఫిల్మ్‌లో సత్తా.. ఉపేందర్‌కు రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News